ETV Bharat / state

కరోనా కాలం..! కలిసొచ్చిన సమయం..!

author img

By

Published : May 17, 2020, 9:01 AM IST

కరోనాను కట్టడి చేయడంలో భాగంగా బయటికి వెళ్లొద్దనే ప్రభుత్వ నిబంధనతో అందరూ గృహాలకే పరిమితమయ్యారు. కొందరు టీవీలు, చరవాణిలకు అతుక్కుపోయారు. మరికొందరు ఇంట్లోని పుస్తకాలు తిరిగేశారు. ఇంకొందరు చేతివంటలను ఇంటిల్లిపాదికి రుచి చూపారు. చిత్రలేఖనంలో బొమ్మలు గీసినవారు కొందరైతే.. ఆన్‌లైన్లో పరిజ్ఞానాన్ని పెంచుకున్నవారు ఇంకొందరు. కలానికి పదునుపెట్టి రచనా వ్యాసంగం చేసిన వారుండగా.. కుట్లు, అల్లికలు, పాతకాలం ఆటలతో గడిపిన వారు ఎందరో.

suryapeta residents are utilizing lock down time
కరోనా కాలం..! కలిసొచ్చిన సమయం..!

లఘు చిత్రంలో నటించిన నాగార్జున(మధ్యలోని వ్యక్తి)

సినిమాల్లో స్థిరపడాలన్న లక్ష్యంతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌)కు చెందిన డి.నాగార్జున. లక్ష్య సాధనలో భాగంగా లఘుచిత్రంలో నటించారు. డైరెక్టింగ్‌ చేస్తూ, కథలు రాసి కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన లఘుచిత్రం ‘సర్పంచి సంధ్యక్క’ను 30 లక్షల మంది తిలకించారు. ఇప్పటివరకు ఏడు కథలు రాసి, రెండు లఘుచిత్రాల్లో నటించారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ కుదేలైంది. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి చేరుకుని కొత్త కథలు రాస్తున్నారు.

పియానో నేర్చుకోవాలన్న ఆసక్తితో..

హుజూర్‌నగర్‌ క్యాషియో కీ బోర్డు నేర్చుకుంటున్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ నోముల వెంకటేశ్వర్లు

హుజూర్‌నగర్‌కు చెందిన సైకాలజిస్టు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నోముల వెంకటేశ్వర్లు క్యాషియో కీబోర్డు (పియానో) నేర్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సంగీత విద్వాంసుడు, గాయకుడు అయిన రామ్మోహన్‌రావు వద్ద 45 రోజులుగా ఆన్‌లైన్‌ ద్వారా పియానో నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం పాటకు సొంతంగా పియానో వాయించగలుగుతున్నారు. చాలా రోజుల నుంచి పియానో నేర్చుకోవాలని ఉన్న కోరిక నెరవేరిందన్నారు. సంగీతం అనంతమైనదని చాలా నేర్చుకోవాల్సి ఉందని డాక్టర్‌ నోముల వెంకటేశ్వర్లు అన్నారు.

నకిరేకల్‌లోని తన గృహంలో ఆనందన్‌ పర్యవేక్షణలో ఆంగ్లసాధన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వీరేశం

వేముల వీరేశం. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే. ఈయన గ్రామీణ పేద విద్యార్థులకు ఉద్దీపన ఫౌండేషన్‌ ద్వారా ఆంగ్ల మాధ్యమ బోధన ఉచితంగా అందించేందుకు కృషిచేస్తున్నారు. ఈయనకు ఆంగ్లంపై అంతగా పట్టులేదు. విద్యార్థులతో మాట్లాడేందుకు దానిపై పట్టు సాధించాల్సిన అవసరం వచ్చింది. ఆంగ్ల పాఠ్యపుస్తకాల రచయిత డాక్టర్‌ కేఎన్‌ ఆనందన్‌ నేతృత్వంలో నిత్యం రెండు గంటలు దృశ్యశ్రవణ విధానంలో సాధన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంగ్లాన్ని సులభంగా నేర్చుకోవచ్చనే నమ్మకం వచ్చిందంటున్నారు. అలాగే కేఎన్‌ ఆనందన్‌ నేతృత్వంలో ‘షార్ట్‌ఫిల్మ్‌ ఆధారిత ఆంగ్ల సాధన విధానాన్ని’ ఉద్దీపన రూపొందించింది. ఉద్దీపన వెబ్‌సైట్‌ ద్వారా త్వరలో దీనిని అందరికి అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులు, యువకులు, వివిధ రంగాల్లో ఆసక్తిఉన్న వారు సులభంగా ఆంగ్లం నేర్చుకునేలా వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

కలం పట్టిన వైద్యుడు

చెవిముక్కు గొంతు వైద్యులు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్‌ డి.శేఖర్‌రెడ్డి

లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు మిర్యాలగూడకు చెందిన ఈఎన్‌టీ వైద్యుడు డాక్టర్‌ డి.శేఖర్‌రెడ్ఢి చెవి, ముక్కు, గొంతు, స్వరపేటిక అంశాలపై ‘అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధన సంస్థ’ ప్రచురించే పత్రికకు ఐదు వ్యాసాలు రాశారు. అవి ముద్రితమయ్యాయి. అలాగే కొవిడ్‌ వైరస్‌ వ్యాపించకుండా పెట్టుకునే మాస్కులపై వీడియో రూపొందించి అంతర్జాలం, వాట్సప్‌, ఫేస్‌బుక్‌లలో అవగాహన కల్పించారు. చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు ప్రత్యేకంగా టార్చిలైటు కలిగిన ఫేస్‌మాస్కు వేసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు దాన్ని ఎవరు తయారు చేయలేదు. స్థానికంగా లభించే ల్యామినేషన్‌ కాగితం స్టిక్కర్లను వినియోగించి స్వయంగా తయారుచేసి దీనిని వైద్యులందరికీ అవగాహన కల్పించేలా వీడియో రూపొందించారు.

ఆన్‌లైన్‌లో గీతాలావిష్కరణ

చిట్యాల: ఆన్‌లైన్‌ ద్వారా గీతావిష్కరణ చేస్తున్న పెరుమాళ్ల ఆనంద్‌

నల్గొండకు చెందిన పెరుమాళ్ల ఆనంద్‌ చిట్యాల మండలం వట్టిమర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్లోపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన ‘సృజన సాహితీ సంస్థ’ను ఏర్పాటుచేసుకున్నారు. ఈ పేరుతో వంద మందితో వాట్సాప్‌ సమూహాన్ని సృష్టించారు. మార్చి 29 నుంచి ఆన్‌లైన్‌లో క్విజ్‌ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌లో ‘ఇల్లే స్వర్గసీమ’ పేరుతో ఆనంద్‌ ఓ గీతాన్ని రాశారు. దానిని ఆవిష్కరించడానికి లాక్‌డౌన్‌ నిబంధనలు అడ్డురావడంతో ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నారు. ఏప్రిల్‌ 28న గీతాన్ని ఆవిష్కరించారు. ఈనెల 4న ‘కరోనా కాలం’ పేరుతో మరో ప్రజాచైతన్య గీతాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే ఆవిష్కరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.