మంత్రి జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీలో 48 స్థానాలకు గానూ... 24 చోట్ల తెరాస విజయం సాధించింది. 15 స్థానాలు కాంగ్రెస్, 5 స్థానాలు భాజపా, నాలుగు చోట్ల ఇతరులు గెలిచారు. కోదాడ మున్సిపాలిటీని కూడా తెరాస కైవసం చేసుకుంది. 35 స్థానాలు ఉండగా... 25 చోట్ల తెరాస అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని హుజూర్నగర్ మున్సిపాలిటీలో 2వార్డులు ఉండగా... 21 స్థానాల్లో తెరాస గెలిచి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 6స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 1 చోట ఇతరులు గెలిచారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో తెరాస, కాంగ్రెస్ చెరో 7 స్థానాలు గెలుచుకున్నారు. ఇతరులు ఒకచోట విజయం సాధించారు. తిరుమలగిరిలో 11 చోట్ల అధికార పార్టీ గెలిచింది. 4 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.