సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కలెక్టర్ అమాయ్కుమార్ పర్యటించారు. ఇప్పటి వరకూ ఇళ్ల స్థలాలు, పరిహారం అందలేదని బాధితులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. కొత్తగా నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో కనీసం సదుపాయాలు లేవని ఆవేద వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ, పాఠశాల నిర్మించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన వారికి మత్స్య కార్మికులకు రాయితీ రుణాలు మంజూరు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: భూ సమస్యలపై ప్రజావేదికలో పాల్గొన్న పాలనాధికారి