సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో నిర్వహిస్తున్న ఇంటింటికీ జ్వర సర్వేను కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అర్ధరాత్రి ఫోన్ చేసినా అధికారులు వెంటనే స్పందించి వైద్యసదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒక ఇంట్లో జ్వరం వచ్చిందంటే... ఆ ఇంటిని సర్వేచేసిన టీంకు వారి పూర్తి సమాచారం తెలిసి ఉండాలని కలెక్టర్ అన్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షల వరకు వేచి చూడకుండా... లక్షణాలున్న వారికి ముందస్తుగా కిట్లు అందజేయాలని కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. వారు ఆ కిట్లను ఉపయోగిస్తున్నారో లేదో నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. సర్వే చేసే అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జమీరోగ్టన్, ఎంపీడీవో ఇందిర, మండల వైద్యాధికారిని త్రివేణి, గ్రామపంచాయతీ కార్యదర్శి వీరబోయిన రాజేశీయాదవ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో