సూర్యాపేట జిల్లా కోదాడ పెద్ద చెరువులో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డారు. మృతులు సమీర్, ప్రవీణ్, భవానీ ప్రసాద్, మహేందర్‌గా గుర్తించారు. ప్రవీణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు స్నేహితులంతా కలుసుకున్నారు.
ఈతకని చెరువులోకి దిగిన సమీర్‌ను కాపాడేందుకు వెళ్లి మిగతా ముగ్గరు కూడా గల్లంతయ్యారు. నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. ఘటనాస్థలానికి ఆర్డీవో కిశోర్‌కుమార్, పోలీసులు చేరుకున్నారు. ప్రవీణ్, భవానీప్రసాద్ హుజూర్‌నగర్, సమీర్ నేరేడుచర్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి:ప్రేమిస్తే చంపే హక్కుందా?