సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాములలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు వృత్తి విద్యలో భాగంగా పొలాల్లో ఉత్సాహంగా వరినాట్లు వేశారు. సుమారు ఒక ఎకరం పొలంలో వంద మంది విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపల్ నాట్లు వేశారు. 65వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న పొలాల్లో అధిక సంఖ్యలో విద్యార్థినులు వరినాట్లు వేయడాన్ని వాహనదారులు ఆసక్తిగా చూశారు. వరినాట్లు వేయడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష