చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని మట్టంపల్లి మండలం రఘునాధపాలెంకు చెందిన ఎస్కే సమీర్ ఏడో తరగతి చదువుతున్నాడు. బక్రీద్ పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి.. తండ్రి సైదావలితో కలిసి సోమవారం పాఠశాలకు తిరిగి వచ్చాడు. ఆ పాఠశాలలో చదువుకోవడం ఇష్టం లేదంటూ తండ్రితో వాగ్వాదానికి దిగి.. హుటాహుటిన మొదటి అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకాడు. దీనితో విద్యార్థి కాలుకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి సీఐ శ్రీరాములు అయోధ్య పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఇవీ చూడండి: కేసీఆర్ కిట్... అమ్మకు అందని ఆసరా