సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామ పంచాయతీని రాష్ట్ర ఫ్లైయింగ్ స్కాడ్ అధికారి, ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోల్ అధికారి చక్రవర్తి తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలోని రికార్డులను పరిశీలించారు. గ్రామంలో వాడుతున్న వీధిలైట్లు నాణ్యతగా ఉండాలని ఐఎస్ఐ మార్క్ ఉన్నవి మాత్రమే వాడాలని సూచించారు.
అంగన్ వాడీ, రేషన్ దుకాణాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్మశానవాటిక, డంపింగ్ యార్డు, పట్టణంలోని మురుకికాలువలను పరీశీలించారు. పంచాయతీ కార్యాలయంలో ప్రతి రికార్డును అందుబాటులో ఉంచుకోవాలని తనిఖీ అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిరా, పంచాయతీ కార్యదర్శి రాజేశ్ యాదవ్, సర్పంచ్ తీగల కరుణశ్రీ ,ఏపీఓ శ్రీరాములు, ఈసీ వీరభద్రాచారి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం