సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చారిత్రక పిల్లలమర్రి శివాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. శివరాత్రి వేడుకలకు పిల్లలమర్రి ఎరకేశ్వర, నామేశ్వర ఆలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
![Shivaratri celebrations were held at the Pillalamarri temples in Suryapeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10960454_pillalamari.png)
వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఎరకేశ్వరాలయం, నామేశ్వరాలయలలో ముందుగా మూలవిరాట్‌కు ప్రథమ అభిషేకం చేసి.. అనంతరం శివుడికి పంచామృతలతో అభిషేకాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: భార్యపై అనుమానంతో కాలు, చెయ్యి నరికిన భర్త