సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోదాడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆటో ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ముందున్న వాహనాన్ని దాటి వెళ్లబోయి ఎదురుగా వస్తున్న సిమెంటు లోడు లారీని ఢీకొట్దింది. ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ఉన్నారు. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కోదాడలోని ఓ అపార్ట్మెంటుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తమ వారు ఇక లేరన్న విషయం తెలుసుకున్న మృతుల బందువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ్మరలో శ్రీరామ నవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఎమ్మెల్యే పరామర్శ
బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించారు. జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. లారీని సీజ్ చేశామని అన్నారు.
ఇదీ చదవండి : టోల్ ఉద్యోగిని 8కి.మీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్