ETV Bharat / state

నిద్రిస్తున్న గార్డును బలితీసుకున్న ట్యాంకర్​ - సెక్యూరిటీ గార్డు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ సంస్థ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. బుధవారం విధులకు వెళ్లిన సెక్యూరిటీ గార్డు రోషన్​కుమార్​ రహదారి పక్కనే నిద్రించారు. గురువారం రహదారిని నీళ్లతో తడిపేందుకు వచ్చిన  ట్యాంకర్​ డ్రైవర్..​ రోషన్​కుమార్​ను గుర్తించకుండా వాహనాన్ని అతనిపైకి పోనిచ్చాడు. తీవ్రగాయాలతో సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు.

నిద్రిస్తున్న గార్డును బలితీసుకున్న ట్యాంకర్​
author img

By

Published : May 31, 2019, 6:36 PM IST

నిద్రిస్తున్న గార్డును బలితీసుకున్న ట్యాంకర్​

ఓ నీటి ట్యాంకర్​ డ్రైవర్​ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణం ప్రాంతంలో బీహార్​కు చెందిన రోషన్​ కుమార్​ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు వెళ్లిన రోషన్​, అనంతరం రహదారి పక్కన నిద్రించాడు. గురువారం ఉదయం రహదారిపై నీళ్లు చల్లేందుకు ట్యాంకర్​ వచ్చింది. రహదారిపై నిద్రిస్తున్న రోషన్​కుమార్​ను గమనించని నీటి ట్యాంకర్​ డ్రైవర్​ అతనిపైకి వాహనాన్ని పోనిచ్చాడు. దీంతో సెక్యూరిటీ గార్డుకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. నిర్మాణ సంస్థ సెక్యూరిటీ ఇంఛార్జీ పరమేష్​ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.

ఇవీ చూడండి: దర్జాగా వచ్చాడు... దారుణంగా నరికి చంపాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.