వరంగల్లో తొమ్మిది నెలల పాపపై జరిగిన అమానుష ఘటనకు నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని పలు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కామాంధుడిని బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. నగర బస్టాండ్ నుంచి మిర్యాలగూడ క్రాస్‌రోడ్ వరకు ర్యాలీ తీశారు. ఇప్పటివరకు శిక్షించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల్లో సవరణలు చేసి ఇలాంటి పనులకు పాల్పడకుండా కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు నినదించారు.
ఇవీ చూడండి: చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో