సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అలింగాపురం సబ్స్టేషన్ వద్ద ఎస్సీ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదనే సాకుతో వారం నుంచి తమ కాలనీకి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు వాపోయారు. మీటర్లు ధ్వంసం చేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఎస్సీలకు ఉచిత కరెంట్ అంటూ తెరాస ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వారం రోజుల నుంచి చీకట్లో ఉంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: గుండె జబ్బులను వేగంగా గుర్తించే విధానం