సూర్యాపేట డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నాయి. డిపో నుంచి బస్సులను బయటకు వెళ్లనీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్క బస్సు కూడా రోడ్డుపైకి రాలేదు. విధుల్లో చేరిన కార్మికల ఫొటోలకు చెప్పుల దండలు వేసి వాటిని ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశారు. వారు ద్రోహులంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు కార్మికులు. ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు