సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలుకూరు మండలం బేతావోలు గ్రామానికి చెందిన 20 మంది కూలీలు 2ఆటోలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేట మండలం బాలుసుపాడులో వరి నాట్లు వేయడానకిి వెళ్లారు. పని ముగించుకొని తిరుగు ప్రయాణంలో కోదాడ బైపాస్ వద్దకు రాగానే.. వారి ఆటోలను ఓ కారు అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు ఆటోలు అతివేగంగా పోటీపడి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..