సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అమరేశ్వరి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పెదవీడు గ్రామానికి చెందిన వీరబాబు, మరేయన్నగా గుర్తించారు. మృతుడు మరేయన్న ఎన్సీఎల్ కాలేజీలో అటెండర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
క్షతగాత్రులను హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.