ETV Bharat / state

Revanth Reddy Vs Jagadeesh Reddy : 'ఉచిత్‌ విద్యుత్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పుడైనా సమీక్ష చేశారా..?' - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Fires On Jagidesh Reddy : ఉచిత్‌ విద్యుత్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పుడైనా సమీక్ష చేశారా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేవని.. కానీ బీఆర్‌ఎస్‌ పాలనలో 20వ తేదీ వచ్చినా జీతాలు పడటం లేదని ఎద్దేవా చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకుల చేరికల సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

Revanth reddy
Revanth reddy
author img

By

Published : Jul 18, 2023, 10:47 PM IST

Revanth Reddy Comments On Jagidesh Reddy : ఒకవైపు రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని జగదీశ్‌ రెడ్డి చెబుతుంటే.. మరోవైపు సీఎండీ ప్రభాకర్‌ రావు 24 గంటలు సింగిల్‌ ఫేజ్‌ మాత్రమే ఇస్తున్నామని అంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. తన శాఖలో ఏం జరుగుతుందో జగదీశ్‌ రెడ్డికి తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. సూర్యాపేట నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకుల చేరికల సందర్భంగా రేవంత్‌ రెడ్డి మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

జగదీశ్‌ రెడ్డిని మంత్రివా? లేక ఆ శాఖలో పని చేసే బంట్రోతువా అంటూ రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. అసలు ఎప్పుడైనా ఉచిత విద్యుత్‌పై సమీక్ష చేశారా అంటూ మండిపడ్డారు. ఆర్టీజన్లను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి.. ఇప్పుడు వారిని మోసం చేశారని ఆరోపించారు.

Revanth Reddy Sensational Commnets On Jagidesh Reddy : కాంగ్రెస్‌ హయాంలో ప్రతి నెల 1వ తేదీనే విద్యుత్‌ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేవని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. అలాంటిది బీఆర్‌ఎస్‌ పాలనలో 20వ తేదీ వచ్చినా ఇంకా వారి ఖాతాల్లో జీతాలు పడటం లేదని ఆరోపించారు. ఇంతలా జీతాలు ఇవ్వలేని స్థితికి విద్యుత్‌ శాఖ దిగజారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా విద్యుత్‌ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు సిగ్గుతో జగదీశ్‌ రెడ్డి తలవంచుకొని.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వెంటనే రాజీనామా చేసి విద్యుత్‌ ఉద్యోగులకు, తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది జగదీశ్‌ రెడ్డి మాత్రమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సూర్యాపేట బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరిక : సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సూర్యాపేట కాంగ్రెస్‌ ఇంఛార్జి పటేల్‌ రమేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నివాసానికి వచ్చిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నెరేళ్ల మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంబాబు, మాజీ కౌన్సిలర్లతోపాటు ఇతర నేతలు పార్టీలో చేరినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట పట్టణం, సూర్యాపేట రూరల్, పెన్ పహాడ్, ఆత్మకూరు చివ్వేంల మండలాల నుంచి ఈ చేరికలు జరిగినట్లు వివరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.