సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో వరద నీరు భారీగా ప్రవహించింది. ఆత్మకూరు (యస్) మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో కొన్ని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. మరికొన్ని ధాన్యం రాశుల చుట్టూ వరద నీరు చేరింది.
పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాశులు వర్షపు నీటిలో తడిశాయి. ధాన్యం తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు