రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఈ తరుణంలో సూర్యాపేట జిల్లా చింతల పాలెం బుగ్గమాదరం వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు చేరి పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిందని రైతులు వాపోతున్నారు.
ముఖమాదారం నుంచి పులిచింతల, దొండపాడు చింతలపాలెం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : నిరవధిక సమ్మెలో గాంధీ ఆస్పత్రి పొరుగుసేవల సిబ్బంది