ETV Bharat / state

పులిచింతలకు తగ్గని వరద నీటి ప్రవాహం.. భయాందోళనలో స్థానికులు! - వరద నీటి ప్రవాహం

సూర్యాపేట జిల్లాలోని పులిచింతల డ్యామ్​కు వరద నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. నాగార్జున సాగర్​ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల కృష్ణా నీటి ప్రవాహం పులిచింతల ప్రాజెక్టు వైపు ప్రవహిస్తున్నది. 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ ఇన్​ఫ్లో ఇంకా తగ్గలేదు. వరద ప్రవాహం పట్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

pulichinthala peoples scared about inflo water to pulichinthala
పులిచింతలకు తగ్గని వరద నీటి ప్రవాహం.. భయాందోళనలో స్థానికులు!
author img

By

Published : Aug 22, 2020, 10:51 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల డ్యామ్​కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేస్తుండటం వల్ల పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు 16 గేట్లు తెరవగా.. కృష్ణానదిలోకి 3 లక్షల 30 వే క్యూసెక్కుల నీరు నదిలోకి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 175 అడుగులు కాగా.. నీటిమట్టం 167 అడుగుల వద్ద ఉంది. మొత్తం 45 టీఎంసీలకు గాను 34 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 4 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో పులిచింతల ప్రాజెక్ట్​లోకి వస్తుంది. విద్యుత్ సామర్థ్యం ద్వారా 15 వేల నీరు నదిలోకి విడుదల అవుతుంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం స్థాయికి చేరుకోవడం, వరద ప్రవాహం కొనసాగుతుండటం వల్ల భూప్రకంపనలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మేళ్లచెరువు మండలంలో గతంలో 22 గ్రామాలు పులిచింతల ప్రాజెక్టు ముంపునకు గురయ్యాయి. తాజాగా ముంపునకు గురయ్యే గ్రామాల్లో అడ్లూరు, నెమలిపురి, వెల్లటూరు, శోభనాద్రి గూడెం ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ముంపు బారిన పడే అవకాశం ఉన్న గ్రామాలకు అధికారులు వచ్చి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముంపునకు గ్రామాలకు ప్యాకేజీలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నిల్వ ఉంచడం వల్ల భూప్రకంపనలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉమ్మడి మేళ్లచెరువు మండల ప్రజలను భూప్రకంపనలు నుండి కాపాడాలని కోరుతున్నారు.

ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.