ETV Bharat / state

మఠంపల్లి ప్రభుత్వ స్థలంలో నిరుపేదల గుడారాలు - Poor people tents at Mathampalli Government Place

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 469లోని 20 గుంటల ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు గుడారాలు వేసుకుని నివాసముంటున్నారు. ఎస్సీ హాస్టల్ కింద కేటాయించిన ఈ స్థలాన్ని ఖాళీ చేయమని రెవెన్యూ అధికారులు చెప్పినా.. వారు అక్కణ్నుంచి కదలడం లేదు.

poor people arranged shelters in government place in matampally
మఠంపల్లి ప్రభుత్వ స్థలంలో నిరుపేదల గుడారాలు
author img

By

Published : Sep 4, 2020, 11:51 AM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో సర్వే నంబర్ 469లోని ఎకరం 22 గుంటల ప్రభుత్వ స్థలం ఉంది. దీనిలో 20 గుంటలు ఎస్సీ హాస్టల్​కు కేటాయించిన సర్కార్ నిధులు మంజూరు చేయకపోవడం వల్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఈ స్థలంలో ఇళ్లులేని నిరుపేదలు గుడారాలు వేసుకుని మకాం పెట్టారు.

ప్రస్తుతం ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినా వారు అక్కణ్నుంచి కదలడం లేదు. తమకు ఇళ్లు లేనందున ఈ స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్​కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యకు పరిష్కారం చూపుతానని, ప్రస్తుతం ఆ స్థలంలో గుడారాలు తీసివేసి ఖాళీ చేయాలని తహసీల్దార్ జయశ్రీ పేదలను కోరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.