రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని చెరువులు, వాగులు నిండుకుండను తలపిస్తున్నాయి. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి రుద్రమ్మ చెరువు నుంచి వరద నీరు ఖమ్మం జిల్లా పాలేరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండను తలపిస్తున్న చెరువులు.. కొద్దిపాటి వర్షానికే మత్తడి పోస్తున్నాయి.
నూతనకల్ మండలం గుండెల సింగారంలోని చెరువు ఉద్ధృతంగా ప్రవహించి.. సూర్యాపేట-దంతాలపల్లి వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.