సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మై హోం సిమెంట్స్ మైనింగ్ లీజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో తెరాస, భాజపా మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధం జరిగింది.
నిజాయితీని నిరూపించుకునేందుకు శివాలయంలో భాజపా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి ప్రమాణానికి సిద్ధమయ్యారు. పోలీసులు జోక్యం చేసుకొని భాజపా నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు, భాజపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదీ చదవండి: కూకట్పల్లిలో అంబరాన్నంటేలా భోగి వేడుకలు