సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్లో అధికారులు మార్కెట్‌ను సిద్ధం చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు ఉండాల్సిన మార్కెట్...పన్నెండు దాటినా మూసి వేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం కావడంతో చికెన్, మటన్, చేపల సెంటర్ల వద్ద జనాల తాకిడి ఎక్కువైంది. కొందరు కనీస సామాజిక దూరం పాటించడం లేదని... వచ్చిన వారు మాస్కులు సైతం ధరించడం లేదని వాపోయారు. మాస్కులు ధరించకుండా వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీచూడండి: రెండు రోజుల్లో ఏకంగా 118 కేసులు