ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పింఛన్​ లబ్ధిదారుల ధర్నా - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

అధికారులు తమను ఇబ్బందిపెడుతున్నారని పింఛను లబ్ధిదారులు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మఠంపల్లి మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు.

సమస్యలు పరిష్కరించాలని పింఛన్​ లబ్ధిదారుల ధర్నా

author img

By

Published : Sep 10, 2020, 5:10 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో పింఛను లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. పింఛను ఇచ్చే సమయంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

నెలనెలా.. సమయానికి పింఛన్​ ఇవ్వడం లేదని... కనీసం తాగునీటి సదుపాయం కలిగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పింఛన్​ లబ్ధిదారుల కోసం పక్కా భవనం నిర్మించాలని డిమాండ్​ చేస్తూ మఠంపల్లి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.