రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మల తరువాత రెండో పెద్ద జాతరగా... సుర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి లింగమంతుల జాతర గుర్తింపు పొందింది. ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన వేడుకలు గురువారం రాత్రి మకరతోరణం తరలింపుతో ముగిశాయి. కిందటి ఆదివారం సమీపంలోని కేసారం గ్రామం నుంచి దేవర పెట్టెను లింగమంతుల గట్టుకు చేర్చడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
జాతరలో చివరి ఘట్టంగా మకరతోరణం తరలింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మకర తోరణం అలంకరణకు సూర్యాపేట పట్టణానికి చెందిన కోడి, వల్లపు వంశస్థులు హక్కుదారులుగా ఉన్నారు. జాతర చివరి రోజు కావడంతో పరిసర ప్రాంతాల్లోని భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరైనప్పటికీ... చివరి రోజున రాత్రి సమయంలో ఆర్టీసీ సర్వీసులను అధికారులు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.
ఇదీ చదవండి: తెరాసకు ఓటు వేస్తే చెప్పుకు వేసినట్లే: బండి సంజయ్