ఎరువుల కొరతకు ప్రధాన కారణం తెరాస ప్రభుత్వ అలసత్వమేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కనపడ్డవారికల్లా కండువా కప్పే ఉత్సాహాన్ని.. రైతులపై చూపిస్తే బాగుండేదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ పార్టీ శ్రేణులతో నిరసనకు దిగారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రైతుబంధు, రెండు పడక గదుల ఇళ్లతోపాటు ఏ సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు కావడం లేదని ఉత్తమ్ విమర్శలు చేశారు.
ఇవీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ