సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ... ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. రోగులకు పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆహారాన్ని అందించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. ధైర్యంగా ఉండాలని కోరారు.
హుజూర్‌నగర్‌లో 100 పడకల ఏరియా ఆసుపత్రిని 2012లో నాటి ముఖ్యమంత్రి రోశయ్యచే నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఆసుపత్రిలో మొత్తం 49 డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 8 మాత్రమే ఉన్నారని వెల్లడించారు. 100 పడకల ఆసుపత్రిలో సిటీస్కాన్ లేక.. ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. గైనకాలజిస్టుల కొరత ఉందని వెల్లడించారు. ఆసుపత్రి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుష్ వైద్య విధానంలో చికిత్స