సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రోజురోజుకు తమకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పద్మావతి తెలిపింది. తెరాస పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తానని... ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. మాల మహానాడు తెరాస పార్టీకి మద్దతివ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ శాసనసభ పక్ష నేతగా ఉన్న భట్టిని తొలగించినప్పటికీ... మాల మహానాడు తెరాసకు ఎలా మద్దతిస్తుందన్నారు.
ఇవీ చూడండి: పు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..