ETV Bharat / state

పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​ - పెద్దగుట్టు జాతర

paddagattu jathara: సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి పెద్దగుట్టు జాతరకు భక్తులు పోటెత్తారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు డప్పు సప్పులతో భారీ ఊరేగింపుగా రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.

పెద్దగట్టు జాతర
పెద్దగట్టు జాతర
author img

By

Published : Feb 6, 2023, 5:22 PM IST

paddagattu jathara: దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై కొలువైన యాదవుల ఆరాధ్య దైవం "లింగమంతుల స్వామి" జాతర ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క తరువాత రెండో అతిపెద్దదిగా లింగమంతుల స్వామి జాతరకు గుర్తింపు ఉంది.

ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు కర్ణాటక నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మేర భక్తులు జాతరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్​, శ్రీనివాస్​గౌడ్​ స్వామి వారిని దర్శించుకున్నారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక దుస్తులైన గజ్జెల లాగులు ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డప్పుల మోతలు, భేరీల విన్యాసాలతో వాయినాలు నిర్వహించారు. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగి పోతుంది ఊరేగింపులతో కోలాహాలాలతో శివలింగ ఓలింగా అంటూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. లింగమంతుల స్వామికి పొట్టేళ్లు భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమంతో తీసుకువస్తున్నారు.

ఈరోజు ఉదయం నుంచి భక్తులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయరహదారిపై ఇతర వాహనాలను వేర్వేరు మార్గాల్లోకి మళ్లించినప్పుటికి.. జాతక కోసం చాలామంది ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాల్లో రావడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నా.. నీటికోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

జాతర కోసం పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారు. 1850 మంది సిబ్బందితో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా చేపడుతున్నారు. ఇందుకోసం ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించారు.

భారీగా వచ్చే భక్తులకు స్థల సమస్య తలెత్తకుండా పెద్దగట్టు పరిసరాలలోని వ్యవసాయ భూములకు పంట పరిహారం చెల్లించి లీజుకు తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో వాహనాలను వివిధ దారుల్లోకి మళ్లించారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద ఖమ్మం జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఆర్టీసీ బస్సులను మాత్రం సూర్యాపేట బస్టాండ్‌ వరకు అనుమతిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున గంపల ప్రదక్షిణతో ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఐదోరోజు మకర తోరణం తిరిగి కేసారానికి తరలింపుతో ముగుస్తుంది.

పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు కిలోమీటర్​ మేర ట్రాఫిక్​జామ్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.