సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి 14 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సీమీటర్లు, ఎన్95 మాస్కులను ఎన్ఆర్ఐ శరత్ చంద్ర మిత్ర బృందం అందించారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రికి శరత్ చంద్ర తరఫున… సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్ వైద్యాధికారులకు పంపిణీ చేశారు.
మద్దిరాల మండలం కుక్కడంకి చెందిన వేముగంటి శరత్ చంద్ర అమెరికాలో స్థిరపడి… మాతృభూమికి సాయం చేయాలనే తపన ఉన్నందుకు వారిని అభినందిస్తున్నానని చెవిటి వెంకన్నతెలిపారు. కార్యక్రమంలో తుంగతుర్తి సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్, డీఎంహెచ్ఓ కోటాచలం, డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, గుడిపాటి నర్సయ్య, అనురాధ కిషన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Sonu Sood: సిద్దిపేటలో త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్