సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళి గూడెంకు చెందిన శ్యాం సుందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. మాయమాటలు చెప్పి లొంగదీసుకొని గర్భవతిని చేశాడు. తన స్నేహితుడి సాయంతో అబార్షన్ కూడా చేయించాడు. తర్వాత మాట్లాడడం తగ్గించాడు. యువతి గట్టిగా నిలదీయడంతో నాకు నువ్వొద్దంటూ దూరం పెట్టాడు.
ఏం చేయాలో పాలుపోని యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పెద్దమనుషులతో మాట్లాడి తల్లిదండ్రులు శ్యాం సుందర్‌ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమయింది. ఇక బతిమాలి కష్టమని యువతి పోలీసులను ఆశ్రయించింది. శ్యాం సుందర్ తనను ప్రేమించి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఎలాగైనా సరే తనకు న్యాయం చేయాలంటూ వారిని వేడుకుంటోంది.
ఇవీ చూడండి: దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచండి: హైకోర్టు