మూడో విడత పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గత రెండు విడతల్లోని పెండింగ్ పనులు పూర్తి చేయాలని జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ అన్నారు. ముఖ్యంగా డంపింగ్ యార్డులు, స్మశానవాటికల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు ఆవగాహన కల్పిస్తూ మురికి కాలువలు, వాటర్ ట్యాంకులు, బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రపరచాలన్నారు.
ప్రతి గ్రామంలో అధికారులు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎంపీపీ మన్యం రేణుక అన్నారు. గ్రామసభ తీర్మాణం ప్రకారం సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అంటువ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎంపీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ' హరితహారం నిర్వహణ పకడ్బందీగా ఉండాలి'