సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పిక్లానాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు లకావత్ రామారావు అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయన మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రికి వెళ్లి అతని కుటంబసభ్యులను కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరామర్శించారు.
గిరిజన బిడ్డ రామారావు 1994 నుంచి నాకు మంచి మిత్రుడు. చిన్న వయసులో చనిపోవడం బాధాకరం. అతని కుటుంబానికి మేము, మా పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. చింతలపాలెం మండల కాంగ్రెస్ మంచి నాయకున్ని కోల్పోయిందన్నారు. కాలునొప్పి కారణంగా రామారావు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు
ఇదీ చదవండి: కరోనా వేళ బడికి వెళ్లలేమంటున్న విద్యార్థులు!