ETV Bharat / state

ఒ లింగా.... ఓ లింగా....

రెండేళ్లకోసారి యాదవులు ప్రతిష్ఠాత్మకంగా జరిపే దురాజ్​పల్లి  జాతరకు వేళయింది. ఇందుకు 15 రోజుల ముందు నిర్వహించే దిష్టి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.

పెద్దగట్టులో దిష్టిపూజ
author img

By

Published : Feb 11, 2019, 4:54 PM IST

పెద్దగట్టులో దిష్టిపూజ
డిల్లెం బల్లెం చప్పుళ్లు, డోలు వాయిద్యాలు, ఎరుపు రంగు బనియన్లు, గజ్జెలు కుట్టిన లాగులు ధరించి, కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలు పట్టుకొని.... లయబద్ధంగా నడుస్తూ.. ఒ లింగా, ఓ లింగా నామస్మరణలు వినగానే టక్కున గుర్తుకొచ్చేది.... పెద్దగట్టు జాతర. రెండేళ్లకోసారి యాదవులు ప్రతిష్ఠాత్మకంగా జరిపే దురాజ్​పల్లి జాతరకు వేళయింది. ఇందుకు 15 రోజుల ముందు నిర్వహించే దిష్టి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. జాతర సూచకంగా జరిగే ఈ క్రతువుకు వేలాది మంది యాదవ భక్తులు గట్టుబాట పట్టినారు.
undefined
దిష్టి పూజ మహోత్సవంతో జాతర మొదటి క్రతువు ఆదివారం అర్ధరాత్రి ఆరంభమైంది. ఆనవాయితీ ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయ పాలెం నుంచి దేవరపెట్టే (అందనపు చౌడమ్మ)ను శనివారం సూర్యాపేట మండలం కేసారంకు తీసుకొచ్చారు. హక్కుదారులుగా ఉన్న గొర్ల , మెంతబోయిన , మున్నా వంశస్థులు చౌడమ్మకు ఎదురేగి వీరనం తాళంతో సంబరాలు చేస్తూ ఆలయానికి చేర్చారు. పూజలు ముగించిన అనంతరం.... తల్లి పిల్ల గొర్రెతో పాటు పూజా సామగ్రితో అర్ధరాత్రి పెద్దగట్టుకు కాలినడకతో చేరుకున్నారు. లింగమంతులస్వామి ఆలయానికి చేరుకున్న దేవర పెట్టెతో మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు.
కుమ్మరి ఇంటి నుంచి తీసుకొచ్చిన రెండు కొత్త కుండల్లో బోనం వండి నైవేద్యంగా... బూడిద పట్నంలో రెండు రాశులుగా పోశారు . ఇందులో దిష్టి కుంభాలను ఏర్పాటు చేసి దీపారాధన అనంతరం మొక్కులు చెల్లించారు. బై కండ్లు దేవుని చరిత్రకు సంబంధించి కథలు పాటలు పాడుకుంటూ ఆలయ పూజారులు హక్కుదారులకు బొట్టు బోనం అప్పగించారు. మెంత బోయిన, మున్నా వారు వండిన రెండు బోనాలను పెరుగుతో కలిపి చౌడమ్మ ఎదుట ఉంచారు. తర్వాత ఆలయప్రాంగణంలో బలి ముద్ద చల్లడంతో దిష్టి పూజ పరిపూర్ణమవుతుంది.
33 మంది దేవతలు కొలువై ఉన్న దేవరపెట్టె కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి ఎదురు చూశారు. ఈ క్రమంలో జాతర ప్రాంగణానికి చేరుకోగానే పెద్ద ఎత్తున ఓ లింగ నామస్మరణంతో గట్టు ప్రాంగణం మారు మోగింది. చౌడమ్మను తాకడంతో పాటు దేవర పెట్టే కింది నుంచి ఈగితే పుణ్యం లభిస్తుందని వారి నమ్మకం. దేవరపెట్టెను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు.

Intro:tg_adb_91_10_vasantapanchamivedukalu_av_c9

Body:ఏ లక్ష్మణ్, కంట్రిబ్యూటర్, ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్
ఘనంగా వసంత పంచమి వేడుకలు
ఇచ్చోడలో కన్నుల పండుగగా హనుమాన్ సాయి ఆలయ వార్షికోత్సవం

( ) :- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ సాయి ఆలయ వార్షికోత్సవం, జాతరను అంగరంగ వైభవంగా జరిపారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండలంలోని ఆయా గ్రామాల తోపాటు నేరడిగొండ నేరడిగొండ గుడిహత్నూర్ బజార్హత్నూర్ బోర్ ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా జాతర సందడి ఇచ్చోడలో నెలకొంది .పెద్ద ఎత్తున దుకాణాలు జాతరలో వేయడంతో రంగులరాట్నం ఉత్సాహంగా యువత జనం పిల్లలు ఊగారు. అన్నదాన కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరక్కుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.