సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని చెరువులో చేపలు పడుతున్నారనే సమాచారంతో 500 మంది చెరువు వద్దకు చేరుకున్నారు. భౌతిక దూరాన్ని పాటించకుండా చేపల కోసం ఒకరిపై ఒకరు తోసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను నియంత్రించడానికి ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడం వల్ల వారు చేతులెత్తేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్పినా ప్రజలు పట్టించుకోవడం లేదు. దీనిపై తక్షణమే విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్