సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. హుజూర్నగర్ తెరాస పార్టీ కార్యాలయంలో నామా విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి కనీసం ఈఎస్ఐ ఆస్పత్రి లేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి ఏం చేయలేదని నాగేశ్వర రావు విమర్శించారు. నిధులు కేటాయించాలంటూ ఉత్తమ్.. వినతి పత్రం కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్కు, తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని నామా అన్నారు.
ఇవీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య