సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఇలియాజ్ గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేదు.
ఇలియాజ్ విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన ముస్లిం పెద్దలు.. మానవత్వంతో ముందుకొచ్చారు. చికిత్స నిమిత్తం రూ.1,56,000 బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపత్కాలంలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.
ఇలియాజ్ తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యత అతడిపై పడింది. ఇప్పటికే పూట గడవడం కష్టంగా ఉన్న కుటుంబానికి తాను భారమవుతున్నానని.. దాతలెవరైనా ముందుకొచ్చి తనను ఆదుకోవాలని ఇలియాజ్ కోరుతున్నాడు.