తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని విస్మరించిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పర్యటించిన మందకృష్ణ... నియంతృత్వ పాలనను తరిమికొట్టాలని సూచించారు. రైతుల రుణమాఫీని గాలికొదిలేశరన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. ఎవరు ఎదిరిస్తే వారిని అణగదొక్కాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ను విమర్శించారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించి బుద్ధిచెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రశ్నించే గొంతును బతికించాలని కోరారు.
ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం