అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు హత్య ఘటనలో ఆమెను రక్షించబోయి తీవ్రంగా గాయపడి ఇవాళ మృతి చెందిన ఆమె కారు డ్రైవరు మృతదేహం స్వగ్రామానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలోని ఇంటికి తీసుకెళ్లారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. మృతిడి కుటుంబాన్ని ఆదుకుంటామని హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి