ETV Bharat / state

"మీ ఓట్లు నాకు అవసరం లేదు".. గ్రామస్థులపై ఉత్తమ్​ అసహనం..! - ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Uttamkumar Reddy Comments: ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఉత్తమ్​.. అక్కడి గ్రామస్థులతో "మీ ఓట్లు నాకు అవసరం లేదు" అని ముఖం మీదే కోపంగా అనేసి వచ్చేశారు. అంత మాట ఎలా అన్నారని ఆలోచిస్తున్నారా..? అలా ఎందుకు అనాల్సివచ్చిందంటే...!!

MP Uttamkumar Reddy Angry statements on villagers got viral

author img

By

Published : Jun 11, 2022, 7:25 PM IST

"మీ ఓట్లు నాకు అవసరం లేదు".. గ్రామస్థులపై ఉత్తమ్​ అసహనం..!

Uttamkumar Reddy Comments: నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోండ్రియాలలో పర్యటించిన ఉత్తమ్​కుమార్​రెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న ఎంపీ.. స్థానికుల ఇబ్బందులు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తీవ్ర అసహనంతో ఉన్న ఉన్న ప్రజలు.. ఉత్తమ్​పై ప్రశ్నల వర్షం కురిపించారు.

"ఓట్ల కోసం వచ్చావా..?" అంటూ ఉత్తమ్​ను గ్రామస్థులు నిలదీశారు. ఇన్నిరోజులు తమ సమస్యలు పట్టలేదా..? అని ప్రశ్నించారు. తమ సమస్యలు ఎవ్వరికీ అవసరం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్న స్థానికులను శాంతపర్చేందుకు​ ప్రయత్నించినా లాభం లేకపోవటంతో.. ఉత్తమ్​ అసహనం వ్యక్తం చేశారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానంగా "మీ ఓట్లు నాకు అవసరం లేదు" అంటూ ముఖం మీది చెప్పుకుంటూ.. ఉత్తమ్ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఓట్లు అవసరం లేదని వెళ్లిపోవటంపై స్థానికులు మరింత ఆగ్రహంవ్యక్తం చేశారు.

అనంతరం నిర్వహించిన రచ్చబండ సభలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్​.. తాను ఓట్ల కోసం రాలేదని స్పష్టం చేశారు. కష్టసుఖాలు తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు. కులమతాలకతీతంగా అందరూ బాగుండాలని తాను కోరుకుంటానన్నారు.

"ఈరోజు నేను రాజకీయ లబ్ది కోసం రాలేదు. ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో నిలబడుతున్నాననో రాలేదు.. ఓట్ల కోసం ప్రలోభపెట్టడానికి రాలేదు. కేవలం మీతో కాసేపు సమయం గడపాలని వచ్చాను. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, పార్టీల వాళ్లంతా బాగుండాలని కోరుకుంటాను. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తా." - ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎంపీ

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.