ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి' - ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ఏర్పాట్లు వార్తలు

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్​ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని 90 పోలింగ్ కేంద్రాలకు పోలీసు బందోబస్తుతో పోలింగ్​ సామగ్రిని తరలించారు.

mlc elections in suryapet
సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Mar 13, 2021, 5:27 PM IST

వరంగల్​, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సూర్యాపేట జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 90 పోలింగ్​ కేంద్రాలకు భారీ బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సుల ద్వారా పోలింగ్​ సామగ్రిని తరలించారు. జిల్లాలో పోలింగ్​ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కేంద్రంలో ఉన్న 9 కౌంటర్లు, మరో 2 ప్రత్యేక కౌంటర్లలో జంబో, పెద్ద బాక్సులను, బ్యాలెట్ పేపర్లను తరలించే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

సమర్థవంతంగా...

జిల్లాలో పోలింగ్​కు నియమించిన అధికారులు, సిబ్బంది దాదాపు 1500 మంది ఉన్నారని.. ఈసీ నిబంధనల మేరకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్​ సూచించారు. 38 సమస్యాత్మక కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు, 12 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 26 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని కలెక్టర్​ చెప్పారు. 21 సాధారణ పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. తాగునీరు, నిరంతర విద్యుత్​తో పాటు మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ స్కెచ్​పెన్​తో మాత్రమే ఓటు వేయాలి: ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.