పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కేసీఆర్కు పట్టుకుందని ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఎన్నికల కోసమే తెరాస ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో భూ కబ్జాలు, ఇసుక మాఫియా జోరుగా సాగుతున్నాయని విమర్శించారు. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని.. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు. తీన్మార్ మల్లన్న పాదయాత్ర సూర్యాపేట జిల్లా నాగారం మీదుగా అర్వపల్లికి చేరుకుంది.
ఇదీ చదవండి: మరో 9 వేల పోస్టుల భర్తీ... కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ నియమాకాలు...!