ETV Bharat / state

'నిరూపించలేకపోతే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకుంటా' - పల్లా రాజేశ్వర్​ రెడ్డి వార్తలు

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి... ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని... లేనిపక్షంలో పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు.

mlc-candidate-palla-rajeshwar-reddy-campaign-at-huzurnagar
'నిరూపించలేకపోతే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకుంటా'
author img

By

Published : Feb 15, 2021, 5:33 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలో ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. హుజూర్​నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 3,500 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... లక్షా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని... లేనిపక్షంలో పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ విషయంపై చర్చకు మీరు సిద్ధమా అంటూ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో... 14 లక్షల వరకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.

ఇదీ చూడండి: దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఓటమితోనే ఉద్యోగాల ప్రకటన: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.