రైతుల కోసం నిత్యం శ్రమించే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, పాలకీడు మండల సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ఠ్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా సీఎం కేసీఆర్.. పేరు చెప్పొచ్చన్నారు. దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తున్నా... సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పోరెడ్డి శైలజారవీందర్ రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, గరిడేపల్లి, పాలకీడు మండలాల పార్టీ అధ్యక్షులు జోగు అరవింద రెడ్డి, మలిమంటి దుర్గారావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.