తాను ఇసుక మాఫియా, భూ కబ్జా వంటి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్, రైతుల పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోందన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా... నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: 'వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు... తెరాస ఎంత?'