సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కొత్తగూడెం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1888 , బీ గ్రేడ్ ధాన్యానికి 1868 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకోవాలని.. మధ్య దళారులకు అమ్ముకొని మోసపోవద్దని సూచించారు.
రైతు శ్రేయస్సు కొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎస్.ఏ. రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర వెంకన్న, పలువురు గ్రామసర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ధాన్యంలో తేమతో మద్దతు ధర రాక రైతుల ఇబ్బందులు