ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్తో పాటు.. జాజిరెడ్డిగూడెం, నాగారం మండలాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఆయా మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ..
- పసునూరు గ్రామంలో రూ. 18 లక్షల వ్యయంతో చేపట్టనున్న పశువుల వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
- జాజిరెడ్డిగూడెం, అర్వపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన
- నాగారం మండలం పస్తాల గ్రామంలో నిర్మాణమైన సీసీ రోడ్డు ప్రారంభం
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికతో పాటు.. ఆయా మండలాల ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భాజపావి బూటకపు మాటలు: తలసాని