ముఖ్యమంత్రి సహాయనిధి సేవలను నిరుపేద ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 35 మందికి రూ.13,46,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు.
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల్లో రూ.16.5 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. దేవునిగుట్ట తండా గ్రామంలో రూ.20 లక్షల ఖర్చుతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు.
సీఎం దృష్టికి..
ఎంతో మంది నిరుపేద ప్రజలకు ఆరోగ్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థికసాయం అందుతోందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పూర్తిస్థాయిలో వాటిని పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు.
![Paving of additional classrooms in the school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10437472_gk.png)
కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, మార్కెట్, మున్సిపల్ ఛైర్మెన్లు, వైస్ ఛైర్మన్లు, మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కలెక్టరేట్లో హరీశ్.. ఉద్యోగుల తీరుపై అసహనం