ETV Bharat / state

దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్ - lock down effect

కష్టాల నావను నడిపిస్తున్న ఓ చిన్నారి గాథను తెలుసుకుని గతేడాదే తనకు తోచినంత సాయమందించారు. మళ్లీ ఇప్పుడున్న కరవు కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి పరిస్థితిని తెలుసుకున్నారు. వెంటనే ఆ బాలికకు మళ్లీ ఆపన్నహస్తం అందించి నిజమైన నాయకునిగా ప్రశంసలు పొందుతున్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​.

mla gadari kishore helped 2nd time to a 8th class student
మరోసారి దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే
author img

By

Published : May 6, 2020, 3:35 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన గెగుళ్ల శోభ కుటుంబానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ మరోసారి అండగా నిలిచారు. 8వ త‌గతి చదుతున్న శోభ... మానసిక వికలాంగురాలైన తన తల్లి ఉపేంద్రను చూసుకుంటూ కష్టాలు పడుతున్న సమయంలో ఈటీవీ భారత్​లో ప్రచురితమైన "అమ్మకే అమ్మయిన చిన్నారి" కథనానికి స్పందించి గాదరి కిశోర్​ సాయమందించారు.

ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా శోభ తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందించి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే చేసిన సాయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.